Wednesday 17 August 2011

land rights struggle

మిత్రులారా ,
రాష్ట్ర యానాది సమాఖ్య అధ్వర్యంలో జరుగు తున్న భూ పోరాటంలో భాగంగా వాకాడు మండలంలోని దుగరాజ పట్నం రెవిన్యూ గ్రామంలో స.no.888,889,890,891,892,893,894,895,896-901,లలో అన్యాక్రాంతమైన,ఖాలిగా వున్న 337 ఎకరముల ప్రభుత్వ భూములను ఆ గ్రామంలోని భూమి లేని నిరుపేద యానాదులు దళితులూ ఇటీవల మూకుమ్మడిగా ఆక్రమించు కోవడం జరిగింది.ఈ భూమిలో పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకొన్నారు.అదేవిధముగా పంబలి గ్రామములో యానాదుల పేర్లమీద మంజూరు చేసి రికార్డ్స్ లో వుంది,వేరే వారి అనుభవంలో వున్న 216 ఎకరముల భూమి గురించి,యానాది సమాఖ్య కృషి ఫలితముగ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ భూముల గురించి విచారించి 6 వ విడత భు పంపినిలో పంపిణి చేయమని ఆదేశాలు జారి చేసారు .దీంతో వాకాడు మండల రెవిన్యూ అధికారులు విచారణ మొదలు పెట్టి దుగరాజ పట్నంలోని భుములు కోలిచి హద్దులు వేసారు ౬ వ విడత భు పంపినిలో 192 మందికి వాక్కో ఎకారము చొప్పున పంపిణి చేసేందుకు చర్యలు మొదలు పెట్టారు.పంబలి లోని యానాదుల భూమి ఆక్రమించుకొన్న వారి వద్దనుండి భూములు విడిపించి భూమిలేని యానాదులకు పంపిణి చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు.ఈ విషయమై చొరవతీసుకొని సహాయం చేస్తున జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సౌరబ్ గౌర్ గారికి ARD సంస్థ సిబ్బందికి యానాది సమాఖ్య , పేద ప్రజలు కృతఙ్ఞతలు తెలియ చేసు కొంటున్నారు.కోట వాకాడు,చిత్తమూరు మూడు మండలాల్లో గత ఐదు విడతల భూ పంపిణి కార్యక్రమంలో ప్రభుత్వం యానాదులకు 316 కుటుంబాలకు 260 ఎకరాలు మాత్రమె పంపిణి చేసారు.ఈ సారి వక్క 6 వ విడత భు పంపినిలో ARD సంస్థ పనిచేస్తున్న గ్రామాలలో కనీసం 2,౦౦౦ ఎకరముల భూమి యానాదుల కు వచ్చేటట్లు యానాది సమాఖ్య ARD సంస్థ కృషి చేస్తున్నవి మీ యొక్క సంఘీభావాన్ని కోరు కొంటూ..........
1.JPG

Thursday 7 July 2011

ఎంత అన్యాయం పంబలమ్మ !

ఎంత అన్యాయం పంబలమ్మ !
మా గ్రామ  దేవత పేరు పంబలమ్మ అందుకే మా గ్రామానికి పంబలి అని పేరు వచ్చింది. నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో ఓ కుగ్రామం.వక పక్క సముద్రం మరో పక్క పులికాట్ సరస్సు మధ్యలో మా గ్రామం వక దీవి.
40 సంవతరాల క్రితం శ్రీహరి కోటలో రాకెట్ కేంద్రం ఏర్పాటు చేసినపుడు.రాకెట్లు మీద పడతాయని భయపడి ఈ గ్రామానికి మా పెద్దలు 100 కుటుంబాల వారు వలస
వచ్యాము. పులికాట్ కలువ అంచున తట్యాకు గుడిసెలు వేసుకొని ఉండేవారము.కరెంటు,మంచినీరు,విద్య, వైద్యం,రవాణా, వంటి కనీస వసతులు కూడా ఉండేవి కాదు. అనారోగ్యం చేస్తే చావు తప్ప వేరే మార్గం ఉండేది కాదు.చుట్టూ ఉన్న బనజరు భూములను చదును చేసి  సాగులోకి తెచేందుకు భూసాముల వద్ద పనిచేసే వారము. వారు తినే గింజలు కూలీ కింద ఇచే వారు.ప్రక్రుతి విపత్తులు వచ్చినపుడ్డు మా బాధలు వర్ణనాతీతం.

                                                   2004 లో త్సునామి వచ్చిన తారు వాత  ARD అనే  సేవ సంస్థ కార్యకర్తలు  మా గ్రామానికి సర్వే చేయడానికి వచినపుడు మా పరిస్తితి  గుర్తించి మాతో కల్సి పని చేయడం మొదలు పెట్టారు.మాకు పక్క ఇండ్లు కట్టించి, బ్రతకదానికి వలలు తెప్పలు ఇచ్చారు .అన్నింటి కంటే గొప్పగా మమ్మల్ని చైతన్య పరిచారు.ఆ చైత్యం తోనే నేను 2009 లో శాసన సభ ఎన్నికల్లో కోవుర్లో పోటి చేసే స్తితికి ఎదగ గలిగాను.

           ARD సేవ సంస్థ భూములు గురించి అనేక శిక్షణ కార్య క్రమాలు నిర్వహించింది దీంతో మేము మా గ్రామంలోని భూముల మీద ద్రుష్టి సారించాము.యానాదుల సమాఖ్య ను ఏర్పాటు చేసుకొని సమాచార హక్కు క్రింద భూముల వివరాలు సేకరించాము.
                                                మా గ్రామము రెవిన్యూ భాషలో ఇనాం గ్రామము ,195 సర్వే నమ్బెరులున్నై.అందులో మొత్తం ప్రభుత్వ భూములే! అందులో అనేక సర్వే నె.ల లో 216 ఎకరములు యానాదుల పేర్ల మీద ఉన్నాయ్.అప్పుడు తెలిసింది మా భూములలో మేమే కూలీలుగా పన్చెస్తున్నామని.గత నాలుగు సమ్వత్సరాలుగా పోరాడితే ఇప్పటికి 22 కుటుంబాల వారికీ 44 ఎకరముల మెట్ట,16 ఎకరముల మాగాణి సాధించుకోన్నాము.ఇంకా 156  ఎకరాలు అన్యాక్రాంతంలో ఉంది.మా గ్రామంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అనేకమంది భూస్వాముల  ఆక్రమణలో ఉంది.ప్రభుత్వ రికార్డులలో స్పష్టంగా కనబడుతూ ఉంది .పంబలమ్మ ఏమిటి ఈ అన్యాయం? ఎవరు ఎవరికీ గంతలు కట్టారు?రికార్డులలో యానాదుల భూములలో అడంగలులో భూస్వాముల పేర్లు ఆక్రమణ అని అంత బహిరంగముగా వ్రాస్తున్నారే! ఏమిటీ ఈ విపరీత్యము?వక గ్రామములోనే ఇంత అన్యాయముంటే మరి జిల్లాలో అన్ని గ్రామాల్లో యానాదుల పరిస్త్తితి ఏమిటి? పంబలమ్మ మరీ ఇంత అన్యాయమా?????